భారత్ మార్కెట్లోకి హ్యూండాయ్ ఐపిఓ... 2 m ago
హ్యూండాయ్ కంపెనీ ఐపిఓని భారత మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు శుభవార్త తెలిపింది. ఐపిఓ సబ్‌స్క్రిప్షన్ డేట్ అక్టోబర్ 14 అని తెలిపింది. సౌత్ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యూందాయ్, భారత విభాగమైన హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓని అక్టోబర్ నెల 14న లాంచ్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపిఓగా నిలుస్తుంది. ఈ పరిణామం భారతీయ పరిశ్రమలకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గత నెల 24న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి హ్యూందాయ్ ఐపీఓకి లాంచ్ అనుమతి వచ్చింది.